
భారతీయులకు భారత వాతావరణ శాఖ (IMD) గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాలు రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తున్నాయని చెప్పింది. మరి ఇవాళ మే 9న ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
10 రోజుల్లో నైరుతీ రుతుపవనాలు.. ఇండియాకి వచ్చేస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంటే.. మే 20 నాటికి అవి అండమాన్ సముద్రంలోకి వస్తాయనీ.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో కేరళను తాకుతాయని తెలిపారు. అంటే.. మే 22 నాటికి అవి కేరళను తాకుతాయని అనుకోవచ్చు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణలోకి ఆ చల్లని గాలులు రావడానికి వర్షం కురవడానికీ నాలుగైదు రోజులు పట్టవచ్చు. ఆ లెక్కన.. మే చివరి వారంలో ఏపీ, తెలంగాణలో విస్తారణంగా వర్షాలు పడతాయి అని అనుకోవచ్చు.
IMD అధికారులు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. మే 14 నుంచి 20 వరకు.. వారం పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా పడతాయని IMD చెప్పినట్లు ఆంధ్రప్రభ రిపోర్ట్ చేసింది. ఐతే.. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం 8 శాతం తక్కువగా వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. మొదట్లో వర్షాలు బాగా పడినా.. ఆగస్టు నుంచి వానల జోరు తగ్గిపోవచ్చని తాజా అంచనా.
IMD తాజా రిపోర్ట్ ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో మే 9 నుంచి 12 వరకూ అలాగే.. తెలంగాణ, రాయలసీమలో మే 9, 10 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి, ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీ వాతావరణ శాఖ మాత్రం ఏపీలో మే 9న పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో ఒక ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ వరకూ ద్రోణి ఉండటం వల్ల ఏపీకి వర్ష సూచన ఉందని చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
జూమ్ ఎర్త్ ఐకాన్ శాటిలైట్ లైవ్ డేటా ప్రకారం ఇవాళ మే 9 శనివారం నాడు తెలంగాణలో పలుచని మేఘాల వాతావరణం ఉంటుంది. ఎండ ఎక్కువగానే ఉంటుంది. తేమ తగ్గిపోవడం వల్ల వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ.. చల్లని గాలుల జోరు ఎక్కువగా ఉండటం వల్ల.. అక్కడక్కడా సడెన్ వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. సడెన్‌గా ఈదురు గాలులతో భీకర వర్షాలు.. కొద్దిసేపు కురిసి, ఆగిపోయే తరహా వాతావరణం ఉండగలదు
ఆంధ్రప్రదేశ్‌లో చల్లని గాలులు వీస్తాయి. పలుచని మేఘాలు అక్కడక్కడా ఉంటాయి. కానీ ఇవాళ మే 9 శనివారం నాడు భారీ వర్షాలకు ఛాన్స్ లేదు. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులతో వర్షం పడే ఛాన్స్ ఉంది. అది కూడా దక్షిణ, తూర్పు రాయలసీమలో. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుంది. ఐతే.. ఏపీ చుట్టూ బలమైన మేఘాలు ఉన్నాయి. అవి మే 10న ఏపీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. అవి వస్తే, భారీ వర్షాలు పడగలవు.
గాలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి. హిందూ మహా సముద్రంలో తిరుగుతున్న ఆవర్తనం.. అటు అరేబియా, ఇటు బంగాళాఖాతంలోని మొత్తం గాలులపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈదురు గాలుల వేగం గంటకు 35 కిలోమీటర్లుగా ఉంది. ఈ గాలులు ఏపీలోకి డైరెక్టుగా దూసుకొస్తున్నాయి. అందువల్ల ఏపీలో గాలి వేగం ఇవాళ గంటకు 29 నుంచి 32 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 17 నుంచి 25 కిలోమీటర్లతో చల్లని, వేడి గాలులు వీస్తాయి.
ఉష్ణోగ్రతలు ఏపీ, తెలంగాణలో కొద్దిగా తగ్గాయి. ఇవాళ తెలంగాణలో మాగ్జిమం 39 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. ఏపీలో 38 డిగ్రీల సెల్సియస్ వరకూ వేడి ఉంటుంది. తేమ తెలంగాణలో 28 శాతం, ఏపీలో 38 శాతం ఉంటుంది. ఇలా తేమ తగ్గిపోవడం వల్ల.. వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ.. చుట్టూ ఉన్న ద్రోణి వాతావరణం వల్ల.. మే 10 నుంచి ఏపీ, తెలంగాణలో జోరుగా వర్షాలు పడే అవకాశాలు పెరుగుతున్నాయి.
భూమధ్య రేఖా ప్రాంతంలో యాక్టివిటీ జోరుగానే ఉంది. ఫిలిప్పీన్స్ తూర్పు వైపున హాగుపిట్ (Hagupit) తుపాను గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు సుడిలా తిరిగేలా చేస్తోంది. అంటార్కిటికాలో గాలుల వేగం బాగా పెరిగింది. ఈ మార్పు నైరుతీ రుతుపనాలకు పుష్ ఇస్తుంది. తద్వారా అవి.. భూమధ్య రేఖ దాటి.. అండమాన్, ఇండియా వైపు వచ్చేందుకు వీలవుతుంది. అందువల్ల మే 15 తర్వాత వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఇవాళ వీకెండ్ ప్రయాణాలు చేసేవారికి.. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఐతే.. ఎండలో ప్రయాణాలు చేసేవారు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
