Spread the love

వేసవిలో తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్లలో విటమిన్స్‌, మినరల్స్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరా ను బలంగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. ఇంకా దెబ్బతిన్న కణజాలాలను సరి చేస్తాయని నిపు లు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కాగా, కోడిగుడ్లు తినటం పైన కొందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు రెగ్యలర్ గా తినచ్చా.. ఎన్ని తినాలి.. ఏ సమయంలో తినాలి అనే సందేహాలు సహజం. ఇదే సమయంలో వేసవిలో కోడిగుడ్లు తినం పైన ఉన్న సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

గుడ్లు సూపర్ ఫుడ్స్. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, బి, జింక్‌, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజు గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుడ్లు చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ సమస్యలు లేకుంటే రోజూ గుడ్లు తినవచ్చు. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలని, తద్వారా వేడి రోజులలో కూడా శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. కానీ వేసవిలో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి, రోజులో ఎక్కువ గుడ్లు తినకపోవడమే మంచిది. వేసవిలో గుడ్లు తినకూడదని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది నిజానికి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అయితే వేసవిలో హెవీ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. కోడిగుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవిలో గుడ్లు తింటే మంచిదే. కొందరిలో డైలీ ఎగ్‌ను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె ఆరోగ్యానికి గుడ్లు మేలు చేసేవే అయిన‌ప్ప‌టికీ వీటిని అధికంగా తీసుకోకుండి పరిమితంగా ఆహారంగా మార్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. కోడిగుడ్డు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది. కోడిగుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలె ట్రాల్ ఉంటుంది. ఇది అంతా కూడా ప‌చ్చ‌సొనలోనే ఉంటుంది. గుడ్డు తెల్ల‌సొన‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. గుడ్డు గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికీ వీటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొందరికి సమస్యలు వస్తాయి. దీంతో గుండె సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యడి సలహా మేరకే కోడిగుడ్డు వినియోగించటం మంచింది. వేసవిలో ఈ ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.