Spread the love

తమిళనాడు ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ అద్భుతమైన విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దళపతి విజయ్ గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పీఠానికి అత్యంత చేరవకు చేరుకున్న దళపతి విజయ్ నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఆర్థిక పాఠాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

వెండితెరపై సూపర్‌స్టార్‌గా వెలుగొందిన విజయ్, తన తొలి ఎన్నికల పోరులోనే రాజకీయ రంగంలోనూ అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నటన, రాజకీయాలకు అతీతంగా, విజయ్ ఒక తెలివైన పెట్టుబడిదారుడు, వ్యాపారవేత్త కూడా కావడం విశేషం. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, విజయ్ ఆస్తుల విలువ సుమారు రూ. 400 నుండి రూ. 600 కోట్ల మధ్య ఉంది.

ఫిక్స్ డిపాజిట్లపైనే ఎక్కువ మక్కువ

చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR)లోని ఆయన నివాసం ఉండే భవనం విలువ సుమారు రూ. 80 నుండి రూ. 100 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అఫిడవిట్ ప్రకారం, విజయ్ తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తంలో ఫిక్స్ డిపాజిట్లు ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)లోని కేవలం ఒకే ఒక ఖాతాలో సుమారు రూ. 213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి అలాగే Axis Bank, HDFC Bank, SBI వంటి బ్యాంకుల్లో కూడా ఆయనకు కోట్లాది రూపాయల డిపాజిట్లు ఉన్నాయి.

ప్రతి ఏడాది పెరుగుతున్న ఆదాయం

గత ఐదేళ్లలో, ఆయన మొత్తం ఆదాయం రూ. 500 కోట్లను అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఆయన ఆదాయం గరిష్టంగా రూ. 237 కోట్లకు చేరుకుంది; అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఆయన రూ. 184 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రకటించారు.