Spread the love
మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకు హైప్ పెరుగుతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలని నిర్ణయించినట్టు దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకు హైప్ పెరుగుతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలని నిర్ణయించినట్టు దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఒక మాస్ ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, షూటింగ్ స్పాట్ నుంచి ఓ వీడియో లీక్ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

లీక్ అయిన వీడియోలో శృతి హాస‌న్, రామ్ చరణ్ కలిసి మాస్ స్టెప్పులతో అదరగొడుతున్నట్టు కనిపిస్తున్నారు. చరణ్ తన ఎనర్జీ, స్టైల్‌తో డ్యాన్స్ చేస్తుంటే, శృతి హాసన్ కూడా అతనికి త‌గ్గ‌ట్టే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ జంటను మళ్లీ తెరపై చూడబోతున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఎవ‌డు సినిమా తర్వాత రామ్ చరణ్, శృతి హాసన్ జంటగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఉత్తరాంధ్ర ప్రాంతం నేపథ్యంగా పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.

కథాపరంగా కూడా ఈ సినిమా విభిన్నంగా ఉండనుందని సమాచారం. చరణ్ ఇందులో కేవలం క్రికెట్ ప్లేయర్‌గా మాత్రమే కాకుండా కుస్తీ ఫైటర్‌గా కూడా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ అంశం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ ఐటెమ్ సాంగ్‌కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ మాస్ బీట్ అందించినట్టు సమాచారం. లీక్ వీడియోలో వినిపిస్తున్న సంగీతం, డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ, చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.