
చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి క్రీడలు దోహదపడతాయని చల్లపల్లి సిఐ కె ఈశ్వరరావు అన్నారు.
మోపిదేవి మండల పరిధిలోని పెదకళ్ళేపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. క్రికెట్ పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ ఈశ్వరరావు హాజరయ్యారు.
సోమవారం సాయంత్రం ఉత్కంఠ భరితంగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. శ్రీ తుంగపల్లెమ్మ తల్లి జట్టుకు అలాగే పెదకళ్ళేపల్లి హోమ్ జట్టుకు హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీ తుంగపల్లెమ్మ తల్లి జట్టు విజయకేతనం ఎగురవేసింది.
మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న శ్రీ తుంగపల్లెమ్మ తల్లి జట్టుకు ట్రోఫీతో పాటు 25 వేల నగదు బహుమతిని కెప్టెన్ బచ్చు ప్రశాంత్ ఆధ్వర్యంలోని జట్టు సభ్యులకు సిఐ ఈశ్వరరావు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పెదకళ్లేపల్లి హోమ్ జట్టుకు ట్రోఫీతో పాటు 15 వేల నగదు బహుమతిని కెప్టెన్ అనుముకొండ చిన్న ఆధ్వర్యంలోని జట్టు సభ్యులకు ఎస్సై పామర్తి గౌతమ్ కుమార్ అందజేశారు. మాజేరు జట్టు, వేకనూరు జట్టులు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలవగా, రెండు జట్టులకు కలిపి పది వేల నగదును అందించారు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనుముకొండ చిన్న, తోట హర్షలు కైవసం చేసుకున్నారు. తోట సంతోష్, అరజా రాములు బెస్ట్ బౌలర్లుగా గెలిచారు. అనుముకొండ గోపి, స్వామిలు బెస్ట్ బ్యాట్స్ మెన్ లుగా నిలిచారు.
టోర్లమెంటులో మొదటి జట్టుకు అందించిన 25వేల నగదు బహుమతిని జనసేన పార్టీ సీనియర్ నేత గోళ్ళ శ్రీనివాసరావు, గ్రామానికి చెంది హైదరాబాదులో స్థిరపడిన సోమిశెట్టి ప్రసాద్ లు అందజేశారు. చోడగం రాధాకృష్ణ ( నాని ), దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్ లు సంయుక్తంగా 15 వేల నగదును ద్వితీయ బహుమతి కింద అందించారు. ప్రముఖులు తోట కృష్ణాoజనేయులు, అరజ నాగేశ్వరరావులు పదివేల నగదు బహుమతిని స్పాన్సర్ చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేయడానికి మాజీ సర్పంచ్ అరజా వెంకట సుబ్బారావు 20వేల నగదును అందజేశారు. స్నేహ సొసైటీ నిర్వాహకులు గంధం పద్మజానాయుడు, గంధం వీరాంజనేయులు దంపతులు ఐదువేల నగదు అలాగే ఎంపీటీసీ సభ్యురాలు అరజా ఆశాదేవి 5 వేలు, నీటి సంఘం అధ్యక్షులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు ఐదువేల నగదును పోటీల నిర్వహణ నిమిత్తం అందజేశారు.
కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అరజా రాధిక, అరజా నరేంద్ర, పంచాయతీ పాలకవర్గ మాజీ సభ్యులు అనుమకొండ వాసు, గండు తాండవ కృష్ణ, కోళ్ల నరేష్ లతోపాటు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
