
నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించానున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. అంతే కాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ – కొరటాల శివ కాంబోలో NBK112 ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పోషించబోయే పాత్రపై వస్తున్న లీకులు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే NBK112 కోసం ఆయన ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబును సీఎంగా చూపించిన కొరటాల, ఇప్పుడు బాలయ్య మార్క్ మాస్ ఎలివేషన్లతో ఆ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దబోతున్నారట. అందుకు తగ్గట్టు గానే సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌పై కూడా “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే ట్యాగ్‌లైన్ ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
