దానికి సై అంటున్న ముద్దుగుమ్మలు..
ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో వెలుగొందడం కోసం ఐటెం సాంగ్స్ కి కూడా సై అంటున్నారు.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్రియా శరణ్( Shriya Saran ).ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ.అయితే ప్రత్యేక పాటల్లో చేయడం ఆమెకు కొత్త కాదు.రామ్ ని హీరోగా, ఇలియానాని హీరోయిన్ గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన దేవదాసు సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత మున్నా, తులసి,పులి, నక్షత్రం లాంటి సినిమాల లోని ఐటమ్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
అయితే శ్రియ తాజాగా రెట్రో సినిమాలో( retro movie ) ప్రత్యేక పాటలో సందడి చేయబోతోందట.

మరొక హీరోయిన్ పూజ హెగ్డే( Pooja Hegde ).తెలుగులో తక్కువ సమయంలో నేను చాలామంది హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా.ప్రస్తుతం తమిళ తెలుగు హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
అయితే ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా బిజీ బిజీగా ఉన్న పూజ హెగ్డే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో ఒక ప్రత్యేక పాటలు చిందులు వేయబోతోందట.అయితే గతంలో పూజ హెగ్డే రంగస్థలం, ఎఫ్ 3 సినిమాలలో ఐటెం సాంగ్స్ లో చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది.

మరొక హీరోయిన్ రెబా మోనికా జాన్.ఒకవైపు హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే.
ఒకవైపు హీరోయిన్ గా అలరిస్తూనే మరొకవైపు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది హీరోయిన్లు ఐటమ్ సాంగ్లకు కూడా సై అంటున్నారు.
