పొడిబారిన చర్మం ఇలా చేస్తే

ప్రస్తుత సమ్మర్ సీజన్( Summer season ) లో విరివిగా లభ్యమయ్యే పండ్లలో పుచ్చకాయ ఒకటి.పిల్లలే కాదు పెద్దలు కూడా పుచ్చకాయను( Watermelon ) ఎంతో ఇష్టంగా తింటుంటారు.
పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉండటం వల్ల బాడీని హైడ్రేట్‌గా ఉంచడంలో, హీట్ స్ట్రోక్ బారిన పడకుండా రక్షించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా పుచ్చకాయ ప్రోత్సహిస్తుంది.
ముఖ్యంగా ఎండల దెబ్బకు పొడిబారిన చర్మాన్ని పుచ్చకాయతో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు.

అందుకోసం మిక్సీ జార్ లో గింజ తొలగించిన కొన్ని పుచ్చకాయ ముక్కలను ( Watermelon slices )మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్( Aloe vera gel ), వన్ టీ స్పూన్ తేనె( honey ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.

