Spread the love

రాబోతున్న బిగ్‌బాస్ సీజన్ 10 ఈసారి హోస్ట్ ఎవరు?…|

తెలుగు టెలివిజన్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. నెక్ట్స్ సీజన్ కు రెడీ అవుతోంది. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ను హోస్ట్ చేసేది ఎవరు?

తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ రియాలిటీ షో
తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. నిజానికి ఈ కాన్సెప్ట్ మనది కాదు… ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నది. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా, బాలీవుడ్ లో బిగ్ బాస్ గా స్టార్ట్ అయ్యి.. తెలుగు తెరపైకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. వచ్చీ రావడంతోనే ఫస్ట్ సీజన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బిగ్ బాస్… ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుందీ. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఈసారి బిగ్ బాస్ చాలా స్పెషల్..
ఈసారి బిగ్ బాస్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తెలుగులోకి బిగ్ బాస్ అడుగు పెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈసీజన్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని టీమ్ ప్రయత్నిస్తున్నారట. అందుకోసం ఇప్పటి నుంచే పని మొదలు పెట్టినట్టు సమాచారం.

గత 9 సీజన్లలో లేనంత రేంజ్ లో సెలబ్రిటీలను ఈ సీజన్ లోకి తీసుకునేందుకు ట్రై చేస్తున్నారట. అందుకోసం భారీగా రెమ్యునరేషన్లు కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 9 బ్లాక్ బస్టర్ అవ్వడం.. బిగ్ బాస్ టీమ్ లో ఉత్సాహం రెట్టింపుఅయ్యింది. దాంతో ఈసారీ సీజన్ ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.

మాజీ విన్నర్స్ ఎంట్రీ ఇస్తారా?
బిగ్ బాస్ సీజన్ 10 లో మాజీ బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే వాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకు పంపించి.. ఆడియన్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మాత్రం సాలిడ్ గా ఉండబోతున్నట్టు సమాచారం. అందుకోసం కాంట్రవర్సియల్ స్టార్స్ ను కూడా రంగంలోకి దింపబోతున్నారట టీమ్. సీజన్ 9 లోనే రచ్చ టీమ్ ను దింపాలిన అనుకున్నారు. సామాన్యులు .. సెలబ్రిటీలు కాన్సెప్ట్ ను వర్కౌట్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆతరువాత సెకండ్ సీజన్, 6,7 సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో సీజన్ 8 ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు. ఎదో ఒక విధంగా సీజన్ 8ను సక్సెస్ చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం బ్లాక్ బస్టర్ టీఆర్పీలతో రచ్చ రచ్చ చేశారు.

బిగ్ బాస్ తెలుగు హోస్ట్ ఎవరు?
ఇక బిగ్ బాస్ హౌస్ ను నడిపించాలంటే ఆ హోస్ట్ కు చాలా ఓపిక ఉండాలి, హౌస్ లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి. ఆ విషయంలో ఎన్టీఆర్ , నాగార్జున సక్సెస్ అయ్యారు. కాని సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు. ఇక మూడో సీజన్ నుంచి 9వ సీజన్ వరకూ విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున.అయితే ఒకటీ రెండు సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు. దాంతో హోస్ట్ గా నాగార్జునను తప్పిస్తారని రూమర్లు వినిపించాయి.

లాస్ట్ రెండు బిగ్ బాస్ సీజన్ల విషయంలో.. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి. కానీ.. బిగ్ బాస్ సీజన్ 8 తో పాటు 9 సీజన్ ను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు కింగ్ నాగార్జున. దాంతో భారీగా ప్లాన్ చేస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కూడా నాగార్జునానే హోస్ట్ గా కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ భారీ సక్సెస్ తో .. ఈసారి రెమ్యునరేషన్ కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట టాలీవుడ్ మన్మధుడు.