చికెన్ మరియు మటన్ లలో ఏది గుండెకు ఎక్కువ ప్రమాదకరం?
ఈ రోజుల్లో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు గుండెపోటు బారిన పడుతున్నారు. అందుకే గుండెని జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె కోసం సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటించడం ఎంతో ముఖ్యం. ఇక చికెన్, మటన్ రెండింటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి క్లారిటీ లేదు. కొంతమంది చికెన్ తినడం బెస్ట్ అంటే.. మరికొందరు మటన్‌కు ఓటేస్తారు. అయితే, గుండెకి ఏది తినడం మంచిదో డాక్టర్ క్లారిటీ ఇచ్చారు.

ప్రపంచంలో మాంసాహార ప్రియులకు కొరత లేదు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతల్ని నాన్‌వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. చాలా మంది చికెన్ లేదా మటన్ చాలా ఇష్టంగా తింటారు. చికెన్, మటన్ బోలెడు వెరైటీల్ని ఇష్టంగా లాగిస్తారు. శాఖాహారం లేదా మాంసాహారం తినడం గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్టే.. చికెన్, మటన్ గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కొందరు చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. మరికొందరు మటన్‌ను ఇష్టంగా తింటుంటారు. అయితే, చాలా మంది ఓ డౌట్ ఉంటుంది. ఆరోగ్యానికి చికెన్ మంచిదా లేదా మటన్ అని ఆలోచిస్తారు. రెండింటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ముఖ్యంగా గుండెకి ఏది మంచిది
చికెన్‌లో ఏం ఉంటాయి?

చికెన్ బ్రెస్ట్‌లో తక్కువ కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మీరు 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ తింటే.. దాదాపు 32 గ్రాముల ప్రోటీన్ శరీరానికి చేరుతుంది. మరోవైపు, చికెన్ తొడల్లో ఎక్కువ కొవ్వు, తక్కువ ప్రోటీన్ ఉంటుంది.
చికెన్ లెగ్‌పీస్‌లో దాదాపు 24-26 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. చికెన్ తినేవారి శరీరంలో ప్రోటీన్ లోపం ఉండదు. అందుకే జిమ్ చేసే వారు ఎక్కువగా చికెన్ తినడానికి ఆసక్తి చూపుతారు.
మటన్‌లో ఏం ఉంటాయో తెలుసా?

చికెన్ కంటే మటన్‌లో ఎక్కువ ప్రోటీన్, మినరల్స్ ఉంటాయి. అయితే ఇందులో చికెన్ కంటే ఎక్కువ కొవ్వు ఉంటంది. మటన్ వెనుక భాగం శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. 100 గ్రాముల బ్యాక్ సైడ్ మటన్‌లో దాదాపు 25-27 గ్రాముల ప్రోటీన్, 12-14 గ్రాముల కొవ్వు ఉంటుంది
అదేవిధంగా, ఒక లెగ్ పీస్ మటన్‌లో కూడా 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జిమ్‌కి వెళ్లేవారు మటన్ లెగ్ తినడానికి ఇష్టపడతారు. ఇందులో తక్కువ కొవ్వు ఉంటుంది. ప్రోటీన్‌తో పాటు మటన్‌లో ఐరన్, జింక్, విటమిన్ బి12 కూడా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి ఏది మంచిది?

చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. మటన్‌లో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ రాజేంద్ర అంటున్నారు.
అందుకే దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. అంతేకాకుండా షుగర్ ఉన్నవారు చికెన్ తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే, చికెన్ కంటే నాటుకోడి మాంసం బెస్ట్ అంటున్నారు. చేప కూడా గుండె ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ రాజేంద్ర అంటున్నారు.
గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
