Spread the love
తెలుగు రాష్ట్రాలు లో వాతవరణం ఎక్కడ ఎలా...?

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి, గాలి విచ్చితి ఒకటి గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి ఒడిస్సా, ఛత్తీస్గడ్ ,తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్నాటక, మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ ప్రకారం: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగి తదుపరి నాలుగు రోజులలో సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది

ఇక ఏపీలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. విజయనగరంజిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, మెరకముడియం, రాజాం, రామభద్రాపురం, రేగిడిఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస,కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు

ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు,ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రా జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. శనివారం 48 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయిందని తెలిపారు.అలాగే రేపు 87 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.