
సుకుమార్ తో ప్లాన్ చేసుకున్న ఆర్సి 17 పనులు వేగవంతం చేశారు.ప్రస్తుతం క్యాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీమ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై తెగ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అయితే ఇందులో ఆప్షన్ గా సమంత పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇదివరకు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే.

పుష్పలో ఐటెం సాంగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ ( Citadel web series )ద్వారా పాపులారిటీ విషయంలో సామ్ ముందంజలోనే ఉంది కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

అయితే మరో ఆప్షన్ గా రష్మిక మందనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఈ విషయాలపై పూర్తి సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి

మరోవైపు సుకుమార్ తన టీం తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో భాగంగా బిజీగా ఉన్నారు.ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనక అక్టోబర్ లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సి 17 సెట్స్ పైకి తీసుకెళ్లాలి.
