బ్రెయిన్ షార్ప్ గా పనిచెయ్యాలంటే

జ్ఞాపకశక్తి లేదా మెమోరీ పవర్( Memory Power ) అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.విజయం, అభివృద్ధి, ఆనందం, మరియు బలమైన సంబంధాలను పెంపొందించడానికి జ్ఞాపకశక్తి ఎంతో అవసరం.
అటువంటి జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి కొన్ని పోషకాలను తప్పనిసరిగా తీసుకోవాలి.మరి ఆ పోషకాలు ఏంటి.? అవి ఏయే ఆ ఫుడ్స్ లో లభిస్తాయి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు పనితీరుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్( Omega-3 Fatty Acids ) అత్యంత అవసరం.జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీలకంగా వ్యవహరిస్తాయి.
నరాల పనితీరుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు విటిమన్ బి6, బి9 (ఫోలేట్), బి12 ముఖ్యమైనవి.
గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీన్స్, తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా ఈ విటమిన్లను పొందవచ్చు.

ఇక ఈ పోషకాలను తీసుకోవడంతో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.నిత్యం వ్యాయామం చేయండి.తద్వారా బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.
జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.
