పదో తరగతి ఫలితాలు అప్పుడే

పదో తరగతి.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఆతృతగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం ప్రారంభమైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి.. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.

ఏపీలో ఈ నెల మూడో తేదీ నుంచి పదో తరగతి మూల్యాకనం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్ఢు స్థాయిలో 7 రోజుల్లోనే అంటే ఏప్రిల్ 9లోగా మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్నట్టే జరిగితే ఈ నెల చివరి వారంలో ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలవుతాయి లేదంటే మే తొలి వారం లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు.
