Spread the love

సంక్రాంతి కానుకగా తొలి వందే భారత్ స్లీపర్…|

కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనుంది. సంక్రాంతి కానుకగా ఈ కొత్త రైలు పరుగులు తీయనుంది. వందే భారత్ స్లీపర్ రూట్, ఛార్జీలు ఫిక్స్ అయ్యాయి.

భారతీయ రైల్వే త్వరలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించనుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే రాత్రిపూట విశ్రాంతి పొందుతూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అనుభవించవచ్చు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం, మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ట్రైన్‌ను జనవరి 2026లో రెండవ వారంలో ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు

వందే భారత్ స్లీపర్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ట్రైన్. దీన్ని భారతీయ రైల్వే దూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం రూపొందించింది. రాత్రిపూట ప్రయాణం కోసం తయారు చేసింది. రెండు వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్‌లు సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. కొత్త ట్రైన్‌లు 1,200–1,500 కిలోమీటర్ల రూట్లలో నడిచే అవకాశం ఉంది.

మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ గువాహతి–కొల్‌కతా మధ్య నడుస్తుంది అని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రతి ట్రైన్ లో 16 కోచ్‌లు ఉంటాయి. కోచ్‌ల ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. 11 ఏసీ 3-టియర్, 4 ఏసీ 2-టియర్, 1 ఏసీ కోచ్. ఈ ట్రైన్‌లో 823 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. వచ్చే ఆరు నెలల్లో మరో 8 వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లు పరుగులు తీస్తాయి.

భారత రైల్వే ప్రకారం, గువాహతి–కొల్‌కతా మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ టిక్కెట్ ధరలు ఇలా ఉంటాయి. ఏసీ 3-టియర్ రూ.2,300, ఏసీ 2-టియర్ రూ.3,000, ఏసీ 1-స్టు రూ.3,600. రాత్రి ప్రయాణాలు, దూర ప్రయాణాల కోసం రూపొందించబడిన వందే భారత్ స్లీపర్. ఇప్పటికే దేశవ్యాప్తంగా నడిచే వందే భారత్ చైర్ కార్ సర్వీస్‌కి ఇది స్లీపింగ్ వెర్షన్.

ఎయిర్‌క్రాఫ్ట్ లాంటి అడ్వాన్స్డ్ బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు, విభిన్న అవసరాలకు టాయిలెట్, బేబీ కేర్, హాట్ వాటర్ షవర్ ఏసీ ఫస్ట్ కోచ్‌లో ఉన్నాయి. సేఫ్టీ కోసం కవచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్ ఉంది. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. కోచ్‌లు ఫుల్ సీల్ గ్యాంగ్వేస్, ఆటోమేటిక్ డోర్లు కలిగివుంటాయి. ప్రతి కోచ్‌లో రీడింగ్ లైట్స్, ఛార్జింగ్ పాయింట్స్, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్‌లు, GFRP ఇంటీరియర్‌లు ఉన్నాయి. ట్రైన్ డోర్లు నిర్ణీత స్టేషన్లలో ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతాయి. కేంద్రీభూత కోచ్ మానిటరింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి