Spread the love

షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటి వరలక్ష్మి!

వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) పరిచయం అవసరం లేని పేరు.సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

తన స్వసక్తితో ఇండస్ట్రీలో కొనసాగుతూ నటిగా మంచి సక్సెస్ అందుకున్నారు.వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు.

అయితే హీరోయిన్గా ఏమాత్రం సెట్ అవ్వకపోవడమే కాకుండా ఆమె నటించడం సినిమాలు కూడా సక్సెస్ అందుకోలేకపోయాయి.ఈ క్రమంలోనే హీరోయిన్ పాత్రలను పక్కనపెట్టి సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో వరలక్ష్మి అద్భుతంగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈమెకు తెలుగు తమిళ భాష చిత్రాలలో ఇదే తరహా పాత్రలు చేసే అవకాశాలు వస్తున్నాయి దీంతో వరలక్ష్మి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

వరలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.మ్యూజిక్ వినగానే నాకు కూడా అక్కడికి వచ్చి డాన్స్ చేయాలనిపించింది అంత అద్భుతంగా డాన్స్ చేశారు అంటూ మహిళా డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.

అదేవిధంగా ఒక సీక్రెట్ కూడా రివీల్ చేశారు.

ఒక షో కోసం నేను రోడ్డుపై డాన్స్ ( Dance ) చేయాల్సి వచ్చిందని అలా డాన్స్ చేసినందుకు నాకు ఆ షోలో 2500 రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలిపారు

రోడ్డుపై డాన్స్ చేయడం అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కూడా వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.