షూటింగ్ లో మాకు అదే

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ పూజా హెగ్డేకు( Pooja Hegde ) మంచి గుర్తింపు ఉంది.పూజా హెగ్డే ప్రస్తుతం పలు తమిళ ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.
తోటి నటుల కారణంగా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అనే ప్రశ్నకు పూజా హెగ్డే స్పందిస్తూ ఇది అన్ని పరిశ్రమల్లో ఉందని అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుందని పూజా హెగ్డే వెల్లడించారు.పరిస్థితులను బట్టి దాని స్థాయిలు మారిపోతూ ఉంటాయని పూజా హెగ్డే పేర్కొన్నారు.

మేము బరువైన క్యాస్టూమ్స్, భారీ లెహంగాలు ధరించి సెట్ వరకు నడుచుకుంటూ రావాలని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.
కొన్నిసార్లు అది చూడటానికి బాగున్నా అంత బరువైన దుస్తులను ఈడ్చుకుంటూ వచ్చి షాట్ అయ్యాక అలాగే నడుచుకుంటూ వెళ్లాలని ఇదొక రకమైన వివక్ష అని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

ఇంకొన్ని సార్లు పోస్టర్ లో మా పేరు కూడా ఉండదని లవ్ స్టోరీలో( Love Stories ) నటించినా ఎలాంటి గుర్తింపు ఇవ్వరని పూజా హెగ్డే పేర్కొన్నారు.సినిమా అనేది సమిష్టి కృషి అన్న విషయం అందరూ గుర్తించాలని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు
