సమంత ఇకపై సినిమాలలో

టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) దాదాపుగా 15 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు.వరుసగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడటం సమంతకు శాపంగా మారింది.

అయితే సమంత( Samantha ) రీఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నా గతంలోలా ఆమెకు ఆఫర్లు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సమంత కెరీర్ ను గ్యాప్ ఇవ్వకుండా కొనసాగించి ఉంటే ఆమెకు ఈ ఇబ్బందులు అయితే వచ్చి ఉండేవి కావని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
సమంత యాక్టింగ్ కు దూరంగా ఉండటంతో ప్రేక్షకులు సైతం ఆమెను మరిచిపోయే పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొత్త హీరోయిన్ల ఎంట్రీతో పాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీల హవా కొనసాగుతుండటం గమనార్హం.
సమంతకు టాలీవుడ్ లో పూర్వ వైభవం రావడం సులువైతే కాదని చెప్పవచ్చు.

సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా సమంత మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది.సమంత ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
