ధనుష్ తో రామ్ చరణ్… |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరసుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ మరోవైపు దర్శకుడిగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం కుబేర చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు మెగా హీరోతో కలిసి మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యారట.

హీరోగానే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నాళ్లు తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ధనుష్.. ఇటీవలే సార్ సినిమాతో నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో దర్శకుడిగా మరో సక్సెస్ అందుకున్నాడు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది.

తాజాగా ధనుష్ కొత్త సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ధనుష్ తెరకెక్కించే కొత్త సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నట్లు టాక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన చరణ్.. ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో చరణ్ నటించనున్న సినిమాపై క్యూరియాసిటి నెలకొంది.
