మహేష్‌బాబు సినిమా కోసం రాజమౌళి పారితోషకం… |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైనా ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి మన అందరికి తెలిసిందే.జక్కన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నారు.
అయితే జక్కన్న ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒకదానిని నుంచి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ఇకపోతే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు,( Mahesh Babu ) దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా, మూవీ కోసం రాజమౌళి భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో మహేష్ బాబు సినిమా కోసం కూడా షేర్ తీసుకునే చాన్స్ ఉందంటున్నారు.దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో SSMB 29 ప్రాజెక్ట్ తెరకెక్కుతుండగా, ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా రూపొందుతోంది.
