Spread the love

ప్రభాస్ క్లైమాక్స్ లో..అలా

తెలుగు సినిమాలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం శుభం కార్డుతో పాజిటీవ్ గా ఎండ్ అవ్వాలి. అలా అవ్వకపోతే మనవాళ్లు ఒప్పుకోరు. ఇప్పడిప్పుడే ఈ ట్రెండ్ నుంచి బయటకు వస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్

తాజాగా ప్రభాస్ సినిమా కోసం విషాద క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు

టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్. హీరోలు చాలా హ్యాండ్సమ్ గా, అందంగా కనిపించాలి, పదిమందిని కొట్టాలి, యాక్షన్ సీన్స్ తో హీరోయిజం చూపించాలి అలా అయితేనే మనవాళ్ళు యాక్సప్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మరీ ఇంతలా ఆలోచించకపోయినా.. హీరో డీ గ్లామర్ లుక్ లో కనిపించినా ఒప్పుకుంటారు. కాని తమఅభిమాన హీరోని సినిమా క్లైమాస్స్ లో చంపేస్తాం అంటే మాత్రం ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు.

తాజాగా ప్రభాస్ సినిమా కోసం అలాంటి క్లైమాక్స్ నే ప్లాన్ చేశాడట స్టార్ డైరెక్టర్. తన సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రను చంపేయబోతున్నాడట.

ఫౌజీ సినిమాలో కూడా ఒక మెలో డ్రామా ని యాడ్ చేసి సినిమా చివర్లో ప్రభాస్ ను చంపేయబోతున్నాడా అనే వార్త వైరల్ అవుతుంది. మరి హను రాఘవపూడి ఏం చేస్తాడో చూడాలి.