ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడూ… |

చాలమంది హీరోయిన్స్ సినిమాలో క్రేజ్ తెచ్చుకుంటారు…అందులో కొంత మంది పెళ్లి చేసుకోని సినిమాలకు దూరం అవుతారు..కొంతమంది సక్సెస్ అవ్వలేక సినిమాలకు దూరం గా ఉంటారు…
ఇలాంటి వారిలో ఈమె ఒకరు..

బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు “అవకాయ్ బిర్యానీ” తో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది.
ఇదిలా ఉంటే సినిమాల్లో బిందు మాధవి పెద్దగా యాక్టివ్ గా లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ చిన్నది ఓ ఛాలెంజింగ్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది

దండోరా’ అనే సినిమాలో బిందు మాధవి నటిస్తుంది. ఈ సినిమాలో ఈ చిన్నది వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
