లంకమ్మ తల్లికి ఎమ్మెల్యే సతీమణి పూజలు
అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా వారిని లంకమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఈఓ యార్లగడ్డ శ్రీనివాసరావు (వాసు), ఆలయ పెద్దలు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆలయం వద్ధ భక్తుల కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ శిబిరాన్ని మండలి వెంకట్రామ్ విచ్చేసి ప్రారంభించారు. అనంతరం దేవస్థానం వద్ధ భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీమణి మండలి విజయలక్ష్మి, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ దంపతులు ప్రారంభించారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, నాయకులు బచ్చు వెంకట్ నాధ్ ప్రసాద్, ఎంపీపీ తుంగల సుమతి దేవి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, యాసం శ్రీరాములు, మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీను, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు అప్పికట్ల తారక మస్తాన్, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు తుర్లపాటి రామమోహనరావు, మత్తి శివపార్వతి, మోపిదేవి శివకుమార్, పులిగడ్డ శివపార్వతి, యాసం లంకమ్మ, సైకం శ్రీనివాసరావు, బట్టు మాధవి, నలుకుర్తి రాము, ఎక్స్ అఫిషియో సభ్యుడు తలగడదీవి బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
