Spread the love

ఇప్పటి వరకు నాగార్జునతో నటించని కాజల్….కారణం… |

అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది.

ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ నే షేక్ చేసింది ఈ బ్యూటీ.

ఇప్పడు టాలీవుడ్ లో దూసుకెళ్తున్న సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు ముందున్నారు. వీరు వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, కుర్రహీరోలకు పోటినిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ బ్యూటీ నాగార్జున, వెంకటేష్ తో కలిసి నటించలేదు. వెంకటేష్ సినిమాలో ఇప్పటి వరకు ఈ అమ్మడుకు అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ మిస్ చేసుకుందంట.

నాగార్జున రగడ మూవీలో కాజల్ కు అవకాశం వచ్చిందంట, ఈ మూవీకి కాజల్ ఒకే చెప్పి చివరి నిమిషంలో క్యాన్సల్ చేసుకున్నదంట. అదే విధంగా ది గోస్ట్ మూవీలో మరోసారి ఛాన్స్ వచ్చినా కాజల్ అగర్వాల్ ఈ మూవీని రిజక్ట్ చేసిందంట. అలా రెండు సార్లు నాగార్జున సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ వదులుకుంది. అయితే తాను వదులుకోవడానికి కారణం సరైన కథ దొరకకపోవడమే అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.