
చెడు ఆహారపు అలవాట్లు, క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా, భారతదేశంలో ఫ్యాటీ లివర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖం, చర్మంపై ఫ్యాటీ లివర్ లక్షణాలు కూడా కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం అవసరం.. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
కాలేయం దెబ్బతిన్నప్పుడు, ఆకలి లేకపోవడం, అలసట, కామెర్లు, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల దేశంలో ఈ సమస్య తీవ్రమవుతోంది.

బిలిరుబిన్ స్థాయి పెరగడం వల్ల, చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది.

అటువంటి పరిస్థితిలో, మీరు వైద్యుడిని సంప్రదించడం అవసరం అవుతుంది.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలేయ సమస్యల నుండి బయటపడవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచడం ద్వారా మీ కాలేయాన్ని మెరుగుపరచుకోవచ్చు. లివర్ రోగులు సాధ్యమైనంత మేరకు నూనె పదార్థాలు తినకుండా ఉండాలి.
