Spread the love

టీ తాగడం వల్ల ఇన్ని లాభాలు వున్నాయని తెలిస్తే అస్సలు వదలరు…|

మ‌న‌లో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇది మ‌న శ‌రీరానికి ఉత్పాహాన్ని ఇవ్వ‌డంతో పాటు మ‌న‌కు వివిధ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగేలా చేస్తుంది. అద్భుత‌మైన స‌మ్మేళ‌నాల‌తో నిండిన టీని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల ప్ర‌మాదం కూడా త‌గ్గుతుంది.

మెద‌డు శ‌క్తి పెర‌గ‌డం, గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు టీని తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు. నీటి త‌రువాత అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన పానీయాల‌లో టీ ఒక‌టి. టీ తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌శాంత‌త కార‌ణంగా దీనిని తాగ‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. టీ 5,వేల సంవ‌త్స‌రాల నాటిది. దీనిని చైనాలో క‌నుగొన్నారు.

రోగ నిరోధ‌క శ‌క్తికి..
వివిధ సంస్కృతులు, సంప్ర‌దాయాల కార‌ణంగా టీని త‌యారు చేసే ప‌ద్ద‌తిలో మార్పులు వ‌స్తున్నాయి. టీలో త‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి. ఇందులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో, శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, శ‌రీర శ్రేయ‌స్సును పెంచ‌డంలో మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కార‌ణంగా దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది. టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌ర‌ణ ప్ర‌మాదం 9 నుండి 13 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. టీ తాగ‌డం వ‌ల్ల స‌హ‌జ‌మైన ఉత్తేజం వ‌స్తుంది. దీనిలో కెఫిన్ , ఎల్- థియ‌నిన్ క‌లిసి ఉంటాయి. దీంతో టీ తాగ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త పెరుగుతుంది.

మెద‌డు ప‌నితీరుకు..
టీ లో ఉండే ఎల్- థియ‌నిన్ అనే ఆమైనో అమ్లం ఏకాగ్ర‌త‌ను పెంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. జ్ఞాప‌కశ‌క్తిని పెంచుతుంది. టీ మెద‌డుకు ఒక అద్భుత‌మైన పానీయంలా పని చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కాఫీలా కాకుండా టీ తాగ‌డం వ‌ల్ల కెఫిన్ నెమ్మ‌దిగా గ్ర‌హించ‌బ‌డుతుంది. దీంతో స్థిర‌మైన శ‌క్తి ల‌భిస్తుంది. టీ లో ఉండే ఎల్- థియ‌నిన్ టీకి ఒక గొప్ప రుచిని ఇస్తుంది. టీ తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే విశ్రాంతిని, ఆనంద‌క‌ర‌మైన అనుభూతిని కూడా ఈ అమైనో ఆమ్లం ప్రోత్స‌హిస్తుంది. టీ తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.