వాటిపై దృష్టి పెడితే

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆదాశర్మ( Adah Sharma ) ఒకరు.తక్కువ సినిమాలే చేసినా తన నటనతో పాపులారిటీని పెంచుకున్న ఆదాశర్మ కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్, మరికొన్ని సినిమాలలో థర్డ్ హీరోయిన్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

నాకు వచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తున్నానా లేదా అని మాత్రమే ఆలోచిస్తానని ఆదాశర్మ పేర్కొన్నారు.బాక్సాఫీస్ నంబర్లపై దృష్టి పెడితే సరిగ్గా నటించలేనని ఆమె తెలిపారు.
ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమాలో నటించే సమయంలో ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని అనుకోలేదని ఆదాశర్మ తెలిపారు.

ది కేరళ స్టోరీ లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ ఏకంగా 378 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సినిమాలో నటించే సమయంలో కూడా నేను బాక్సాఫీస్ నంబర్ల గురించి ఆలోచించలేదని ఆదాశర్మ పేర్కొన్నారు.నా పాత్ర ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే నేను చూశానని ఆమె చెప్పుకొచ్చారు.
