కూలింగ్ వాటర్ తాగితే..

ప్రస్తుత వేసవి కాలంలో పిల్లలే కాదు పెద్దలు కూడా ఫ్రిజ్ వాటర్( Fridge water ) తాగేందుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు.వేసవి వేడి మరియు అధిక దాహం నుంచి ఫ్రిడ్జ్ వాటర్ ఉపశమనం కల్పిస్తుందని భావిస్తుంటారు.
అయితే మరోవైపు ఫ్రిజ్ వాటర్ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని కొందరు చెబుతుంటారు.అసలు ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల లాభమా? నష్టమా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చల్లటి నీరు సహాయపడుతుంది.బద్ధకంగా, అలసటగా ఉన్నప్పుడు చల్లటి నీరు తాగితే మానసిక మరియు శరీర ఉల్లాసాన్ని పొందుతారు
హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారొచ్చు.కొంత మందిలో చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది
ఇక కొందరు భోజనం చేసిన వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు.చల్లటి నీరు తాగితే కొవ్వు పదార్థాలు గట్టిపడి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.దాంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఆరోగ్యంగా ఉన్నవారు ఫ్రిజ్ వాటర్ ను మితంగా తాగితే పెద్దగా సమస్య ఉండదు.గుండె, జీర్ణ సమస్యలు ఉన్నవారు మాత్రం ఫ్రిజ్ వాటర్ ను ఎవైడ్ చేయడం ఉత్తమం.
సున్నితమైన దంతాలు కలిగి ఉన్నవారైతే చల్లటి నీరు తాగడం వల్ల దంత సమస్యలను ఎదుర్కొంటారు.

