కొబ్బరిబొండాం నీళ్లు ఆ సమయంలో తాగితే…|
ఈ సహజమైన పానీయంలో ఉత్తమమైన సహజ వరం కొబ్బరి నీళ్లు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ కొబ్బరి నీళ్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎంతో కీలకపాత్రను పోషిస్తోంది.

ప్రస్తుత జనాభా ఉరుకుల పరుగుల జీవితంలో గడుపుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది సరైన భోజనం చేయడం లేదు. అలాగే పని ఒత్తిడి ఎక్కువగా, నిద్రలేమి సమస్యలు వంటి వాటితో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి వెంటనే శక్తిని ఇచ్చే పానీయాన్ని అందరూ సేవించాలని అనుకుంటారు. అయితే అది సహజ పానీయం అయితే ఇంకా ఎన్నో ఆరోగ్యపరమైన బెనిఫిట్స్.

ఈ సహజమైన పానీయంలో ఉత్తమమైన సహజ వరం కొబ్బరి నీళ్లు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ కొబ్బరి నీళ్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎంతో కీలకపాత్రను పోషిస్తోంది.
ఈ కొబ్బరి నీళ్లు అనేక రకాల పోషక గుణాలతో ఉంటాయి. ఇందులో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయడంలో ఎంతో సహయపడుతుంది. వేసవి కాలంలో అధికంగా చెమట పట్టడం వల్ల శరీరం నీరసంగా ఉంటుంది. అప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి తక్షణమే చల్లదనం కలుగుతుంది. అలాగే కోల్పోయిన శక్తిని వెంటనే గ్రహించవచ్చు.

జీర్ణక్రియ సక్రమంగా లేక గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే సహజ ఎంజైములు పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. తరచూ కడుపులో సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి పరిష్కారంగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. ఇందులో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి అనేది తగ్గి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తీసుకుంటే రక్త ప్రసరమ అనేది మెరుగ్గా జరుగుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలును చేస్తాయి. శరీంలోని మలినాలను బయటకు పంపి చర్మాన్ని కాంతి వంతంగా మార్చడమే కాకుండా చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. దీనివల్ల మొటిమలు తగ్గి చర్మం సహజంగా మెరిసేలా మారుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది.
కొబ్బరి నీళ్లను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత తాగితే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు తాగితే సరిపోతుంది. అయితే షుగర్ సమస్య ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తీసుకోవడం మంచిది. సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారికి కొబ్బరి నీళ్లు నిజంగా ఉత్తమమైన పానీయం.
