Spread the love

ఈ జ్యూస్ తో మి జుట్టు నల్లగా ఒత్తుగా ఎలా తాగాలి…?

సమ్మర్ వచ్చిందంటే చాలు.. లీటర్ల కొద్దీ కూల్ డ్రింక్స్ లేపేస్తుంటారు. థంబ్సప్, స్ప్రైట్, మాజా.. అని రకరకాల కూల్ డ్రింక్స్ ను తాగేస్తుంటారు. కానీ ఫ్రెష్ జ్యూస్ లంటే మాత్రం నో చెబుతుంటారు. అయితే ఈ సమ్మర్ సీజన్ లో కూల్ గా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్ రూట్ యాపిల్ జ్యూస్ ను తయారు చేసుకోండి. ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పి, జుట్టు రాలడం, రక్తహీనత ఇలా అనేక సమస్యలకు ఈ జ్యూస్ చెక్ పెడుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలి..? ఇందుకోసం ఏమేం పదార్థాలు కావాలి..?

టేస్టీ బీట్​ రూట్ యాపిల్​ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. యాపిల్ ఒకటి, బీట్‌ రూట్‌ ఒకటి, అల్లం చిన్న ముక్క, నిమ్మరసం అర టీ స్పూన్, పటిక బెల్లం పొడి మూడు స్పూన్లు, మిరియాల పొడి 1/4 స్పూన్, క్యారెట్లు రెండు, ఉసిరికాయలు రెండు తీసుకోవాలి.

బీట్​ రూట్ యాపిల్​ జ్యూస్ తయారీకి ముందుగా యాపిల్ ను శుభ్రంగా కడిగి తొక్క తీసుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లోపలి గింజలను తీసి పడేయాలి. తర్వాత బీట్ రూట్​ తీసుకుని తొక్క తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యారెట్​ ను తీసుకుని అలాగే చేయాలి. తొక్క తీసి ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని.. లోపలి గింజలు తీసేయాలి.

ఆ తర్వాత అల్లాన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పై ముక్కలన్నీ ఇందులో వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పల్ఫ్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి. కాస్త మెత్తగా అయ్యాక అందులో పటిక బెల్లం, మిరియాల పొడి, నిమ్మరసం వేసి మరోసారి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. అంతా మెదిగిందని అనుకున్న తర్వాత ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు పోసి స్పూన్ ​తో మిక్స్ చేసుకోవడమే. దాంతో సూపర్ టేస్టీ బీట్​ రూట్ జ్యూస్ రెడీ అయినట్టే.. ఈ జ్యూస్ ను గ్లాసుకు ఒకరి చొప్పున ముగ్గురు సేవించవచ్చు. ఈ బీట్​ రూట్ జ్యూస్ టేస్టీగా ఉండటంతో పాటుగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది