వారానికి ఎంత చికెన్ తినాలి…ఎక్కువగా తింటే ఏమవుతుంది?
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చికెన్‌ను ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చూస్తారు. చికెన్‌లో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ శారీరక విధులకు ముఖ్యమైనవి. అదనంగా, ఇది శక్తి ఉత్పత్తికి సాయపడే, మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల్ని అందిస్తుంది. అందుకే చాలా మంది జిమ్‌కి వెళ్లేవారు ప్రోటీన్ కోసం చికెన్ ఎక్కువగా తింటారు. అయితే, వారానికి ఎంత చికెన్ తినాలో చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఎక్కువ తింటే ఏమవుతుందో కూడా క్లారిటీ లేదు.

ప్రోటీన్ కోసం చికెన్ బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే, ఓ లెక్క లేకుండా చికెన్ తినేస్తుంటారు. చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. ఈ విషయంపై తరచుగా పరిశోధనలు జరుగుతుంటారు. అలాంటి ఓ అధ్యయనం మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు. ఈ కొత్త పరిశోధన ప్రకారం వారానికి ఎంత చికెన్ తినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది అన్న విషయాలు వెల్లడయ్యాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. చికెన్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి కడుపు, పేగు వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణశయాంతర పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
మహిళల కంటే పురుషులకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. దీని కోసం 19 ఏళ్లు ఇటలీకి చెందిన 4869 మందిపై రీసెర్చ్ జరిపారు. ఎక్కువ చికెన్ తినేవారు పేగు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.

హెల్త్ లైన్ ప్రకారం.. US ఆహార మార్గదర్శకాలు 2020-2025 ప్రకారం.. 2,000 కేలరీల ఆహారంలో లీన్ మీట్ పౌల్ట్రీ, గుడ్ల నుంచి వారానికి 740 గ్రాముల ప్రోటీన్ చేర్చాలని సిఫార్స్ చేయబడింది. చికెన్‌కు నిర్దిష్ట పరిమితి లేదు. అయితే, రెట్ మీట్ కంటే చికెన్ బెస్ట్ అని ఇలా చెప్పారు. వారానికి చికెన్ 300 గ్రాముల కంటే తక్కువ తినడం మంచిదని పరిశోధన చెబుతుంది. 100 గ్రాముల కంటే తక్కువగా తినడం ఇంకా సురక్షితమని చెబుతుంది.
గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
