Spread the love

నోరు జారిన పూజహెగ్డే… |

పూజా హెగ్డే( Pooja Hegde ) పరిచయం అవసరం లేని పేరు… | షూటింగ్ పనులలో బిజీగా ఉన్న పూజ హెగ్డే త్వరలోనే రెట్రో,( Retro ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సూర్య( Suriya ) పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా వచ్చేనెల 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూజా హెగ్డే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు….

ఇలా ఓ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఉండే ఫాలోవర్స్ ( Followers ) గురించి ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు.హీరోలు ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ హీరోయిన్లను మించిన ఫాలోవర్స్ వారికి ఉండరు.అయితే ఇలా హీరోయిన్లకు ఉండే ఫాలోవర్స్ అందరూ కూడా ఫేక్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

చాలా మంది హీరోయిన్స్ కి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అయితే వారంత నిజమైన అభిమానులు కాదని తెలిపారు.