పవన్ కళ్యాణ్ రాజకీయ వారసులు ఎవరు?
టాలీవుడ్ హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత కాలంలోకాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా తన మల్టీటాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది రేణు దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ తన పిల్లలు ఆధ్య, అకీరా నందన్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరోక్షంగా పవన్ కళ్యాణ్ రాజకీయ వారసులుపై క్లారిటీ ఇచ్చింది . ఇంతకీ ఏమన్నారంటే. ?

ఇటీవల రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలు ఆధ్యా, అకీరా గురించి ఓపెన్‌గా మాట్లాడింది. “నేను పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి చేయను. వారు నచ్చిన మార్గంలో ముందుకు సాగాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తాను. పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనివ్వాలి” అని చెప్పింది. ఆమె మరో ఆసక్తికర విషయం చెబుతూ “పిల్లల్లో సంగీతంపై ఆసక్తి పెరగాలని, ఇంటికి పియానో తెప్పించాను. మాస్టర్ పెట్టించుకున్నాను. నేను నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత వారిద్దరూ కూడా ఆసక్తి చూపించి నేర్చుకోవడం మొదలుపెట్టారు” అని తెలిపింది. అలా పిల్లలు సంగీతాన్ని ఆసక్తికరంగా నేర్చుకున్నారని చెప్పింది.

అకీరా నందన్ (Akira Nandan)విషయానికి వస్తే.. ఇప్పటివరకూ సినిమాల్లో కనిపించకపోయినా, ఇప్పటికే స్టార్ లెవల్ క్రేజ్ సంపాదించేశాడ. ఫ్యాన్స్ ఎప్పటినుంచో “అకీరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు?” అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అకీరా కెమెరా ముందు కాకుండా, కెమెరా వెనుక తన ప్రతిభను చూపించాడు. షార్ట్‌ఫిల్మ్స్‌కి అకీరా నందన్ సంగీతం అందిస్తున్నారు. ఇది కేవలం హాబీనే కాకుండా ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌లా అకీరా బాణీలు అందిస్తున్నారు. అకీరాకు చిన్నప్పటి నుంచే పియానో, గిటార్ వంటి వాయిద్యాలు నేర్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ “ఓజీ” మూవీతో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వొచ్చని చాలామంది భావించారు. కానీ ఆ ఆశలు ఫలించలేదు. మరి తెరపై హీరోగా ఎప్పుడు కనిపించనున్నారో వేచి చూడాలి

ఆధ్య సినిమాల్లోకి రాదు.. ప్రజాసేవ దిశగా వెళ్తుంది ఇంటర్వ్యూలో ముఖ్యంగా రేణు దేశాయ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య భవిష్యత్తు గురించి ప్రశ్నించగా, రేణు దేశాయ్ ఇలా సమాధానమిచ్చింది. “ఆధ్య సినిమాల్లోకి రాదు. నాకు గానీ, ఆమెకు గానీ సినిమా మీద ఆ ఆసక్తి లేదు. ఆమె పబ్లిక్ సర్వీస్ వైపు వెళ్తుంది. చిన్న వయసులోనే ప్రజాసేవ, సమాజానికి ఉపయోగపడే పనులపై ఆసక్తి చూపుతుంది. ఆమె జాతకంలో కూడా ‘ప్రజాసేవకురాలిగా ఎదుగుతుంది’, ‘పబ్లిక్ సర్వెంట్'” అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ కావడంతో చర్చనీయంగా మారాయి. దీంతో నెటిజన్లు ‘పవన్ కళ్యాణ్ రాజకీయ వారసురాలు ఆద్యనా?’, ‘జనసేన ఫ్యూచర్ లీడర్‌గా ఆద్యా అవుతుందా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేణు దేశాయ్ చెప్పిన “ప్రజాసేవ” అన్న మాటనే అభిమానులు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. కొందరు అభిమానులు “ఆధ్య తండ్రి దారిలోనే ప్రజాసేవ చేస్తే పవన్ కళ్యాణ్ వారసురాలు అవుతుంది” అని కామెంట్ చేస్తున్నారు. “ఆధ్య ప్రజాసేవ దిశగా వెళ్తుంది” అన్న రేణూ దేశాయ్ మాటలు.. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నిజంగా ఆధ్య తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవలో అడుగుపెడుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి!
