చికెన్ లివర్ లేదా మటన్ లివర్, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం?
చాలా మంది చికెన్, మటన్, చేపలు, సీఫుడ్ వంటి మాంసాహార ఆహారాలు తింటారు.ఇక, ఈ రోజుల్లో చికెన్, మటన్ లివర్‌కి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీటిని తినడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఈ రెండింటిలో పోషకాలు ఉన్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఏది తింటే మంచిది, కలిగే నష్టాలేంటి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్, మటన్ ఈ రెండింటి పేరు వింటే చాలు నోటిలో నోరూరిపోతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకి ఇవి అంటే తెగ ఇష్టం. ఆదివారం వచ్చిదంటే చాలు చికెన్, మటన్‌లో ఏదైనా ఒకదాన్ని పట్టు పట్టాల్సిందే. ఒక్కో సందర్భంలో రెండింటిని తింటారు. చికెన్ ఫ్రై చేసుకుని, మటన్ పులుసు కాంబినేషన్‌తో సండేని ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
ఇక చికెన్, మటన్‌లోని వేరు వేరు భాగాలకి కూడా సపరేటు ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఉదాహరణకు చికెన్ లెగ్ పీస్, చికెన్ బ్రెస్ట్, మేక కాళ్లు, తల ఇలా డిఫరెంట్‌గా తెచ్చుకుని తింటారు. ఇక, చాలా మంది చికెన్ లివర్, మటన్ లివర్ కూడా ఇష్టంగా తింటుంటారు. వాటి విలక్షణమైన రుచి కారణంగా చికెన్, మటన్ లివర్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది.
లివర్ ఫ్రై, లివర్ కర్రీ, లివర్ గ్రేవీ ఇలా రకరకాలుగా వండుకుని తింటారు. అయితే, చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. చికెన్ లివర్, మటన్ లివర్ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.

చికెన్ లివర్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
డాక్టర్ ప్రకారం చికెన్ లివర్ అనేక పోషకాలకు గొప్ప మూలం. ఇందులో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, ఫోలేట్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. చికెన్ లివర్‌లో ఉంటే విటమిన్ బి12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చికెన్ లివర్ రక్తంలో షురగ్ లెవల్స్ తగ్గించడంలో సాయపడుతుంది. అంతేకాకుండా ఉడికించిన చికెన్ లివర్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగకుండా నిరోధించడంలో సాయపడుతుంది.ఇందులో ఉండే ఫోలేట్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మటన్ లివర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
సాధారణం మటన్ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది మటన్ లివర్‌కి తెచ్చుకుని వండుకుంటారు. చాలా మంది మటన్ లివర్ తినడానికి ఇష్టపడతారు.ఇందులో విటమిన్లు ఎ, డి, బి12, ఐరన్, జింక్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
మటన్ లివర్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సాయపడుతుంది. విటమిన్ బి12 ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సాయపడుతుంది. మటన్ లివర్‌లోని ఖనిజాలు శరీర ఎంజైమ్ పనితీరును మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటాయి.

చికెన్ లివర్, మటన్ లివర్ ఏది బెస్ట్?
చికెన్ లివర్ కంటే మటన్ లివర్ ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా, శరీరానికి దీని నుంచి చాలా ఇనుము లభిస్తుంది. ఇది రక్తహీనతకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది శరీరమంతా ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆడవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడతారు. అందుకే వాళ్లు మటన్ లివర్ తినడం మేలు అంటున్నారు డాక్టర్.
