Spread the love

చిరంజీవి అయితే నాకేంటి… |

మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ ఆర్టిస్ట్ అయిన సరే ఎగిరి గంతేస్తారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. రవితేజ లాంటి స్టార్ హీరో కూడా చిరంజీవిని చూసే తాను సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కూడా చిరంజీవి అంటే ఎంతో గౌరవిస్తుంటారు. అలాంటిది చిరంజీవి సినిమాలో చిన్న రోల్ వచ్చిన చాలు అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ నయనతార.

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి.

గతంలో చిరంజీవితో రెండు సినిమాల్లో నటించిన నయనతార, ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా చేస్తోన్న సినిమాకు మాత్రం కచ్చితంగా నయనతార ప్రమోషన్స్‌కు రావాల్సిందేనని చిత్ర యూనిట్ పట్టుబడుతున్నారట. అయితే అలా చేయాలంటే కచ్చితంగా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాలని నయనతార కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.నయనతార డిమాండ్‌కు చిత్ర యూనిట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా తన కండిషన్లు తనవే అన్నట్టుగా నయనతార ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది