వినూత్న రీతిలో సీఐ సంగమేశ్వర రావు ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కల్పించిన ఎస్సై అజయ్ కుమార్

తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఎస్సై అజయ్ కుమార్ వినూత్న రీతిలో సీఐ సంగమేశ్వర రావు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్ధాలను వాహనదారులకు అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో అవగాహన కల్పించారు.

హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్ధాలను వివరిస్తూ హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని వాహనదారుల్లో చైతన్యం కలిగించారు.

హెల్మెట్ ధరించకపోవడంతో జరిగే ప్రమాదం ఒక కుటుంబం వీధిన పడుతుందని, దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, తాగి వాహనాలు నడపద్దని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, తాగి వాహనం నడిపిన కచ్చితంగా జరిమానా విధించబడుతుందని, వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందని సీఐ సంగమేశ్వర రావు, ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు.

