Spread the love

మెగాస్టార్ కోసం విజయశాంతి చేసిన పని..|

చిరంజీవి కోసం ఓ సినిమా విషయంలో విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేసింది. కానీ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం విజయశాంతికి షాకిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లది వెండితెరపై తిరుగులేని జోడీ. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, విజయశాంతి ఏకంగా 19 చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబోలో పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. స్వయం కృషి, కొండవీటి దొంగ, ఛాలెంజ్ లాంటి అద్భుతమైన చిత్రాల్లో కూడా వీరిద్దరూ నటించారు.

కర్తవ్యం సినిమాతో విజయశాంతి తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా విజయశాంతితో సినిమా చేయాలని ప్రయత్నించారు. ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. విజయశాంతితో సినిమా చేయాలని ప్రయత్నించా. దామిని అనే చిత్రానికి రీమేక్ ని విజయశాంతితో చేయాలని అనుకున్నాం. దామిని సూపర్ హిట్ అయిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం. విజయశాంతి చేస్తే బావుంటుంది అని అనిపించింది. నేను డైరెక్ట్ గా అడగకుండా నిర్మాత రవికిశోర్ తో అడిగించా. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడతా అని చెప్పా.

అప్పటికే విజయశాంతి కూడా దామిని మూవీ చూశారట. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది అని రవికిశోర్ చెప్పడంతో వెళ్లి మీట్ అయ్యా. విజయశాంతి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. టైటిల్ ఊర్మిళ అని అనుకున్నాం. అందులో ఎవరైనా స్టార్ హీరో గెస్ట్ రోల్ లో నటించాలి. గెస్ట్ రోల్ కి చిరంజీవి గారిని అడగాలని అనుకున్నాం. వెళ్లి అడిగితే.. కళ్యాణ్ బాబుని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో లాంచ్ చేస్తున్నాం. ఆ మూవీలో నేను గెస్ట్ గా చేద్దాం అని అనుకుంటున్నా. ఇప్పుడు విజయశాంతి మూవీలో చేస్తే అన్నీ గెస్ట్ రోల్స్ అయిపోతాయి. కాబట్టి వద్దులే అని అన్నారు.

చిరంజీవి నో చెప్పడంతో సుమన్ ని ఆ పాత్ర కోసం అడిగాం. సుమన్ ఓకె చెప్పారు. కానీ విజయశాంతి అడ్డం తిరిగారు. నేను చిరంజీవి అయితేనే చేస్తాను, సుమన్ అయితే చేయను అని అన్నారు. ఆమె సూపర్ స్టార్ కదా.. ఆమెకి తగ్గ హీరో ఉండాలి అని అనుకున్నారేమో అంటూ తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు. చిరంజీవి కోసమే ఆమె అంత పెద్ద చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఆమె నో చెప్పడంతో వెంటనే మాలశ్రీని తీసుకోవడం జరిగింది. సుమన్ గెస్ట్ రోల్ లో నటించారు అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.