ఆయనతో నటించడానికి గిల్టీగా ఫీల్ అయ్యా… |

దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ దూసుకుపోతుంది త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అలానే తమిళంలో కూడా విజయ్, అజిత్, సూర్య, ధనుష్ వంటి స్టార్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

మహేష్ బాబు సరసన అతడు, సైనికుడు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కాగా అతడు ఆమె కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాల్లో త్రిష నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు మంచి ఇంపాక్ట్ కలిగించాయి. అయితే త్రిషకు మహేశ్‌బాబుతో పరిచయం వారి సినీ కెరీర్‌కు ముందే ఏర్పడిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇద్దరూ చెన్నైలో చదువు పూర్తిచేసిన సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమై స్నేహితులయ్యారట.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు త్రిష. ఆమె మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. “మహేష్ చాలా ప్రొఫెషనల్. ఉదయం 6 గంటలకు సెట్లో ఉంటారు. రాత్రి 10.30 వరకు షూటింగ్‌లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఆయనను చూస్తే నేను తక్కువ పని చేస్తున్నట్టు గిల్టీగా ఫీలవుతాను. అంతగా డెడికేషన్ ఉన్న నటుడు అని పేర్కొంది. తన సీన్ లేకపోయినా మహేశ్ మానిటర్ దగ్గరే కూర్చుని సెట్లో ఏం జరుగుతోంది చూసేవారని చెప్పింది. ఆయనతో పనిచేసే అనుభవం ప్రొఫెషనల్‌గా నేర్పిన పాఠంలాంటిదని పేర్కొంది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
