ఏపీలో ఉరుములతో…

తదుపరి రెండు నుంచి మూడు రోజుల్లో ఈశాన్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకునే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనాలు కలసి రాష్ట్ర వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలోని మిగిలిన ప్రాంతాల నుంచి.. మొత్తం జార్ఖండ్ & ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా & తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి.. తదుపరి 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం నుండి నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం… దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం తో కలిసిపోయింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
రాయలసీమ:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
