ఉరుములాంటి వార్త..

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఆవర్తనం వ్యాపించింది. దీని ప్రభావంతో అటు ఏపీ.. ఇటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తాయంది.

మంగళవారం ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
