మలబద్దకం తో బాదపడుతున్న వారు…డ్రాగన్‌ఫ్రూట్ తో

మలబద్ధకం ఉందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. టాయిలెట్‌లోకి వెళ్లి ఎంతసేపైనా పని అవ్వదు. దీంతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ సమస్యని దూరం చేసుకునేందుకు సిరప్స్, ట్యాబ్లెట్స్ వాడతారు.
కాన్స్టిపేషన్ సమస్య ఉంటే దేనిపై కూడా కాన్సంట్రేట్ చేయలేరు. మలవిసర్జన సరిగా జరదు. రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. బాడీ బరువు, నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్య నేటి కాలంలో కామన్ అయిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫైబర్ సరిపడినంతగా తినకపోవడం, వర్కౌట్ చేయకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, ఒత్తిడి ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారణాలే. ఈ సమస్యని కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అందులో ఒక పండు హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు
ఈ పండు మలబద్ధకం సమస్యకి ఔషధంలా పనిచేస్తుందన్న ఆయన ప్రేగు కదలికలకి ఈ పండు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

సాధారణంగా, మలబద్ధకం తగ్గేందుకు సరైన పోషకాహారంతో పాటుమంచి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. ఇలా చేయనప్పుడే సమస్య వస్తుంది. దాంతో చాలా మంది సమస్య పరిష్కారానికి మందులు తీసుకుంటారు. అయితే, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే సమస్య తగ్గుతుంది.

అయితే, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం దూరమవ్వడమే కాదు. ఇందులో ఐరన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, దీనిని రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా, ఆడవారు ఈ పండుని తింటే అనీమియా వంటి సమస్యలు ఉండవు. నేచురల్‌గానే సమస్య తగ్గుతుంది
ఆరోగ్య నివేదికల ప్రకారం డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన బాడీలోకి నీటిని లాగుతుంది
దీంతో ప్రేగు కదలికలు మెరుగ్గా మారతాయి. అంతేకాకుండా, ఇందులో ప్రీయోటిక్ ఉంటుంది. ఫైబర్ పేగులలో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. ప్రతిరోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే కొన్ని రోజుల్లోనే మలబద్ధకం తగ్గుతుంది.
