పెళ్లైన ఏడాది లోపే ఇలా..!
అక్కినేని కోడలు, నాగ చైతన్య భార్య శోభిత దూళిపాళ్ల తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
రీసెంట్ గానే అక్కినేని వారసుడు నాగ చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. గతేడాది డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత శోభిత ఆచితూచి అడుగులేస్తూ తన కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది

పెళ్లికి ముందు పలు సినిమాలు చేసింది శోభిత. అంతేకాదు కొన్ని వెబ్ సిరీసుల్లో బోల్డ్ గా కూడా కనిపించింది. దీంతో మ్యారేజ్ తర్వాత శోభిత అడుగులు ఎటువైపు? మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది పబ్లిక్ లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా శోభిత దూళిపాళ్ల ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఆమె చేసిన మెసేజ్ హాట్ టాపిక్ అయింది.
కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన శోభిత.. తాజాగా అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాల్లోకి తన రీఎంట్రీ గురించి హింట్ ఇస్తూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. పైగా దీనికి కోకింగ్ అనే క్యాప్షన్ జత చేసింది.

దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ప్రెగ్నెన్సీ గురించి ప్రకటన వస్తుందనుకుంటే, రీ-ఎంట్రీ పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచిందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు అవసరమా? పిల్లలను కని ఇంటి బాధ్యతలు చూసుకో అంటూ మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ డబ్బింగ్ ఏ సినిమా కోసం అనేది మాత్రం శోభిత వెల్లడించలేదు.
