Spread the love

కీర్తి కొత్తలుక్ కి కారణం

కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా ఉంటూ ట్రెడీషినల్ రోల్స్‌కి ప్రాధాన్యత ఇస్తూ.. తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ఈ అమ్మాయి. మహానటి లాంటి సినిమాలతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.

కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కీర్తి. గ్లామర్ వైపు దృష్టి మళ్లించినట్టుంది ఈ ముద్దుగుమ్మ. మహానటి తర్వాత ఆమెకు వచ్చిన గౌరవం, గుర్తింపు, ఇమేజ్ అన్నీ వేరే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ ఇమేజ్‌కి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది కీర్తి సురేష్. సినిమాలు తక్కువగా ఉన్నా, కీర్తి సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రతి కొత్త ఫోటోషూట్‌తోనూ ఆమె లుక్ మారిపోతూ ఉండటంతో, అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. సాధారణంగా హీరోయిన్లు అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తారు. కానీ కీర్తి విషయంలో అలా అనడం కష్టం.

ఎందుకంటే ఆమెకు ఇప్పటికీ మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయినా కొన్ని సినిమాలకు నో చెప్పింది.. ఇంకా చెప్తుంది కూడా. అదే సమయంలో గ్లామర్ డోస్ మాత్రం భారీగా పెంచేసింది. ఈ మార్పు వెనుక అసలు ఏముంది అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. ట్రెండ్‌లో ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ కొత్త స్టైల్‌కి వెళ్లిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కీర్తి తన ఇమేజ్‌ని కొత్తగా రీడిఫైన్‌ చేసుకోవాలని అనుకుంటోందని.. అందుకే ఇలా రెచ్చిపోతుందంటున్నారు కొందరు. మ్యాటర్ ఏదైనా.. ఆమె ప్రతి అప్‌డేట్‌కి నెటిజన్లు మాత్రం ఫుల్ హ్యాపీస్. ఫ్యాషన్ ఫోటోషూట్లు, గ్లామరస్ అవుట్‌ఫిట్స్, కొత్త మేకోవర్ ఇవన్నీ కీర్తి ఇప్పటి ఇమేజ్‌ను మార్చేసాయి. కొంతమంది అభిమానులు ఈ మార్పుని ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం మహానటిలో కనిపించిన సాఫ్ట్ లుక్ మిస్ అవుతున్నామని చెబుతున్నారు. అయితే కీర్తి ఈ మార్పుతో ఏమి చెప్పాలనుకుంటోందో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.

ఆమెకి ఉన్న టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ రెండూ వేరే లెవల్‌.. కాబట్టి ఏ జోనర్‌లోనైనా రప్ఫాడిస్తుంది. బహుశా గ్లామర్ షో కూడా ఆమె కెరీర్‌లోని కొత్త చాప్టర్ అయ్యుండొచ్చు అంటున్నారు అభిమానులు. మొత్తానికి కీర్తి సురేష్ తనకంటూ ఒక కొత్త ఫేజ్‌లోకి వెళ్లిపోయిందిప్పుడు. ఎవరికి అర్థం కాకపోయినా.. ఆమె ప్లాన్ మాత్రం క్లియర్‌. ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలి.. ఎప్పుడూ న్యూ లుక్‌తో సర్ప్రైజ్ ఇవ్వాలి అనేది ఆమె మాట. సినిమాలు, అవార్డులు అన్నీ పక్కన పెట్టినా.. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాత్రం తగ్గేలా లేదు. ఇక ఈ గ్లామర్ డోస్ వెనుక నిజమైన ఉద్దేశ్యం కూడా ఇదే అయ్యుండొచ్చు. మరి ఈ ఛేంజోవర్ కీర్తి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదా ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమేనా అన్నది మాత్రం టైమ్ చెబుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. కీర్తి సురేష్ ఈ మధ్య చేస్తున్న గ్లామర్ షో అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది.. తనవైపు చూడకుండా ఉండలేనంతగా చూపులు తిప్పుకుంటుంది..! అన్నట్లు పెళ్లి తర్వాతే ఈమె గ్లామర్ డోస్ ఇంకా పెంచేసింది.