Spread the love

నలుగురు హీరోయిన్‌లు కలిసి నటించిన ఏకైక సినిమా

ఇప్పుడంటే సినిమాకొక కొత్త హీరోయిన్ పుట్టుకొస్తుంది కానీ.. పది, పదిహేనేళ్ల కిందట కొందరు హీరోయిన్‌లు మాత్రం ఇండస్ట్రీలో కనిపించేవారు. మాములుగా హీరోకు జోడీగా ఒకరిద్దరు హీరోయిన్‌లు అనేది కామన్. కొన్ని సార్లు ఒక సినిమాలో ముగ్గురు హీరోయిన్‌లు కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఆ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. ముగ్గురు హీరోయిన్లు మాత్రం గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపిస్తారు. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా? ఆ సినిమా మరేదో కాదు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కింగ్ సినిమా. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజై సూపర్ డూపర్ హిట్టు కొట్టింది.

నిజానికి ఈ సినిమా వచ్చి 17 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే మాత్రం కన్నార్పకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. నాగార్జున ఈ సినిమాలో రాజా చంద్రప్రతాప్ శర్మ శరత్‌గా, బొట్టు శీనుగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇక శ్రీహరి జ్ఞానేశ్వర్ భాయ్‌గా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు ఈ సినిమాలో కామెడీ సీన్లు ఉంటయ్‌రా చారీ.. ఇప్పటికీ ఫుల్‌గా నవ్వేస్తుంటాం

బ్రహ్మానందం కామెడీ అయితే తోపు ఉంటది. నాగార్జున కెరీర్‌లోనే మంచి కమర్షియల్ సినిమాగా కింగ్ నిలిచింది. ఈ సినిమాలో త్రిష, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్‌లుగా నటించారు.అర్జున్ బజ్వా, షాయాజీ శిండే, జయ ప్రకాష్.. ఇలా చాలా మంది నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో నువ్వు రెడీ నేను రెడీ అనే సాంగ్ అందిరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ పాటలో చాలా మంది హీరోయిన్‌లు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారు. అందులో జెనీలియా, అనుష్క, ప్రియమణి, స్నేహ ఉల్లాల్, ఛార్మీ, కామ్నా జెత్మలని కనిపిస్తారు. ఈ ఒక్క పాటలో ఈ హీరోయిన్‌లందరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను కామాక్షీ మూవీస్ ప్రొడక్షన్స్‌పై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. కోనవెంకట్, గోపి మోహన్ సంయుక్తంగా ఈ కథను రాశారు.

ఇక ఈ సినిమాకు మేజర్ అస్సెట్ అంటే దేవి శ్రీ ప్రసాద్. అసలు ఏమన్న ఉంటాయా సాంగ్స్. ఇప్పటికీ అలా వింటూనే ఉంటాం. ఒకటి రెండు పాటలని కాదు.. ఆల్బమ్ మొత్తం సూపర్ డూపర్ హిట్టే. టైటిల్ సింగ్ K-I-N-G నుంచి A to Z, చూపు చాలు ఓ మన్మధుడా, ఎంత పని చేస్తివిరో, నేను నీ రాజా, నువ్వు రెడీ నేను రెడీ.. ఇలా పాటలన్నీ చార్ట్ బస్టర్ హిట్లే.