Spread the love

హరిహరవీరమల్లు సినిమా అతని వల్లనే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హరిహర వీరమల్లు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ, టాక్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమాపై కొంత నెగెటివ్‌గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది

పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ, దర్శకుడు మారడం సినిమాకు పెద్ద మైనస్ అయిందని చెప్పాలి. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. జ్యోతి కృష్ణకు దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోవడం, గతంలో ఆయన తీసిన ఒకటి రెండు సినిమాలు నిరాశపరచడం, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం సినిమా ఫలితంపై ప్రభావం చూపింది. క్రిష్ రాసుకున్న కథ బాగున్నప్పటికీ, దానిని దృశ్య రూపంలోకి తీసుకురావడంలో జ్యోతి కృష్ణ విఫలమయ్యారని స్పష్టమవుతోంది.

ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందులోని కోర్ ఎమోషన్ను తెరపై సమర్థవంతంగా ప్రదర్శించాలి. కానీ “హరిహర వీరమల్లు”లో అది లోపించింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగడం, ప్రేక్షకుడిని ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం సినిమాకు భారీ మైనస్‌గా మారింది.

చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో, అతని అభిమానులకు కొంతవరకు నచ్చుతోంది. పవన్ కళ్యాణ్ తనదైన స్వాగ్ను ప్రదర్శించడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. ఆయన రేంజ్ యాక్టింగ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ, వాటిని తెరపై పర్ఫెక్ట్‌గా డెలివరీ చేయడంలో మాత్రం కొంత లోపం కనిపించింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అప్పుడెప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఈ సినిమాకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి.మొత్తానికి, “హరిహర వీరమల్లు” పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంతవరకు నచ్చినా, సగటు ప్రేక్షకుడు మాత్రం నిరాశ చెందుతున్నాడని స్పష్టమవుతోంది.