ఒక్కటవ్వనున్న రష్మిక,విజయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. సూపర్ పెయిర్స్ గా పేరు తెచ్చుకున్న జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఒకటి. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు అధికారికంగా వీరి ప్రేమను ప్రకటిస్తారా అని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా మరోపక్క విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్డమ్ చిత్రం ఈనెల 31 తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరిద్దరూ హీరో హీరోయిన్గా ఏ సినిమాలోని నటించలేదు. ఫ్యామిలీ స్టార్ట్ చిత్రంలో రష్మిక ఒక పాటలో చిన్న డాన్స్ వేసిన కానీ.. ఆ బిట్ ఫైనల్ కట్ లో పెట్టలేదు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కెరియర్ లో 14వ సినిమాగా రానున్న చిత్రంలో రష్మిక హీరోయిన్గా కనిపించని ఉందంట. ఈ సినిమాకి..శ్యామ్ సింఘ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వం వహించనున్నారు. రష్మిక మందన్నా స్క్రిప్ట్ వినగానే.. ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు పైన ప్రారంభం కానుంది అని వినికిడి. కానీ, రష్మిక ప్రస్తుత సినిమాలు అయిన కుబేరా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ పూర్తి అయిన తర్వాతే ఆమె VD14 లో పాల్గొననుంది.
