షాక్ ఇచ్చిన రామ్‌చరణ్ దంపతులు
తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే.

పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు.
దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. మొదటి బిడ్డకు ఆలస్యం చేశాము కానీ.. రెండో బిడ్డకు వెంటనే ప్లాన్ చేస్తామని తెలిపారు. నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తరువాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయలని అనుకోవడం లేదు. సెకండ్ చైల్డ్‌ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ దంపతులు కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన చరణ్, ఇప్పుడు హైదరాబాద్‌లో లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బాధ్యతలను తన భార్య ఉపాసన చేతుల్లో పెట్టనున్నారని సమాచారం. ఉపాసన అపోలో గ్రూప్స్‌తో కలిసి పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మల్టీప్లెక్స్ నిర్వహణ ఆమె చేతిలో ఉండడం వల్ల అది మరింత లగ్జరీ, ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం, డిజైన్ వంటి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయట. అయితే, ఈ థియేటర్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరైనా భాగస్వాములు ఉంటారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్. ఇది నిర్ధారించబడితే, మెగా అభిమానులకు, సినీ ప్రియులకు ఒక కొత్త, అద్భుతమైన థియేటర్ అనుభవం లభిస్తుంది.
