Spread the love

ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.

(శుక్రవారం) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు

దక్షిణ కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు