ఒకప్పుడు కోటీశ్వరురాలు…| ఇప్పుడు…?
సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకసారి గుర్తింపు వచ్చిందంటే.. ఇక వారి కెరీర్‌కు లోటు ఉండదు. ఈ పాపులారిటీతోనే కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరో, హీరోయిన్లు ఎంతో మంది ఉంటారు. ఇలా 30, 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగిన వారున్నారు. ఓ నటి సైతం భారతీయ టెలివిజన్ ఇండస్ట్రీలో ఏకంగా 30 ఏళ్లకు పైగా నటించింది. టీవీ సీరియల్స్‌లో యూనిక్ రోల్స్‌తో పాపులర్ అయింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా ఆమె తీసుకున్న నిర్ణయం, తన జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ గడిపిన ఆ నటి.. ఇప్పుడు రోజు గడవటానికి భిక్షాటన చేస్తోంది. ఆమె ఎవరో కాదు.. నుపూర్ అలంకార్ (Nupur Alankar).

ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీని దాదాపు 3 దశాబ్దాల పాటు ఏలిన నటి.. నుపూర్ అలంకార్ (Nupur Alankar). 1972, నవంబర్ 25న జైపూర్‌లో జన్మించింది. శక్తిమాన్, దియా ఔర్ బాతి హమ్, ఘర్ కి లక్ష్మీ బేటియాన్ వంటి పాపులర్ సీరియల్స్ సహా 157కి పైగా టెలివిజన్ షోలు చేసింది. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉండగా కొంతమంది మాత్రమే సాహసం చేసే నిర్ణయాన్ని తీసుకుని అందరినీ షాక్‌కి గురిచేసింది. 2022, ఫిబ్రవరిలో ఆమె ఈ ప్రాపంచిక జీవితానికి గుడ్‌బై చెప్పి సన్యాసం స్వీకరించింది. ఇక, తన జీవితాన్ని ఆధ్యాత్మిక విషయాలకు అంకితం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.

ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావాలని నుపూర్ అనుకోవడం, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటినుంచో ఈ మార్గాన్ని పాటించాలని ఆమె భావించింది. గురువు శంభు శరణ్ ఝా గైడెన్స్‌లో నుపూర్ ఆధ్యాత్మికతలో మునిగిపోయింది. యమునా, గంగా వంటి పవిత్ర నదులను సందర్శించింది. హిమాలయాల్లో ట్రావెల్ చేసింది. ఏకాంత ఆశ్రమాలు, పురాతన గుహల్లో నివసించింది. ఇలా, భౌతికంగానే కాక.. దైవంతో ఐక్యతను కోరుతూ ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా ఈ జర్నీ మారింది.
పర్సనల్ లైఫ్ ఎఫెక్టా? నుపూర్ తన కో-యాక్టర్ అలంకార్ శ్రీవాస్తవను 2002లో వివాహం చేసుకుంది. మొదట్లో వీరి బంధం బాగానే కొనసాగినా.. తర్వాత వారి మధ్య దూరం పెరిగింది. నుపూర్ క్రమంగా ఆధ్యాత్మికత వైపు అట్రాక్ట్ అయింది.

దీంతో వీరిద్దరూ రెండున్నర ఏళ్ల పాటు విడివిడిగానే జీవించారు. 2022లో నుపూర్ సంసార జీవితాన్ని వదిలిపెట్టి సన్యాసం స్వీకరించింది. అయితే, సన్యాసిగా మారాలనే తన నిర్ణయం ఆధ్యాత్మిక పిలుపని, పూర్తి స్వతంత్రంగా, విచక్షణతో తీసుకున్నదని ఆమె ప్రకటించింది. వ్యక్తిగత, వైవాహిక జీవిత సమస్యలు దీనికి కారణం కావని క్లారిటీ ఇచ్చింది. అయితే, వీరికి పిల్లలు లేరు.
ప్రస్తుతం ఏం చేస్తోందంటే? నుపూర్ అలంకార్.. సన్యాసి అయ్యాక తన ఆస్తులను పూర్తిగా వదిలేసుకుంది. ఆమె కాషాయ వస్త్రాలు ధరించి, కనీస అవసరాలతో జీవించే ఆధ్యాత్మిక జీవనశైలిని పాటిస్తోంది. డబ్బులు సంపాదించే ఏ పనిని కూడా చేయబోనని డిసైడ్ అయ్యింది. సంప్రదాయ సన్యాసుల మాదిరే.. ఆమె కూడా భిక్షాటనతో పొట్ట నింపుకుంటోంది. విరాళాలు, ఇతరుల దయపై ఆధారపడి జీవిస్తోంది. తన జీవితాన్ని స్పిరిచువల్ గ్రోత్, మెడిటేషన్, ప్రజల సేవకు అంకితం చేసినట్లు వెల్లడించింది.
