దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్
ప్రతి నెలా ప్రారంభంలో కొత్త ఆర్థిక మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పన్నుల దాకా, పెన్షన్ స్కీమ్స్ నుంచి ఇంధన ధరల వరకూ పలు రంగాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం

GST అంటే గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్. ఇది మనం ప్రతి రోజూ చేసే కొనుగోళ్లపై ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో GST కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో జరుగనుంది. నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్స్‌ను తగ్గించి, కేవలం 5%, 12% రెండు శ్లాబ్స్ మాత్రమే ఉంచే అవకాశముంది. దీని వల్ల రోజువారీగా ఉపయోగించే వస్తువులపై పన్ను తక్కువ అవుతుంది.

సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలపైనా హాల్‌మార్క్ విధానం అమలులోకి వచ్చే అవకాశముంది. ఇప్పటివరకు ఇది బంగారానికి మాత్రమే ఉంది. ఇకపై వెండికీ ఉండే ఛాన్సుంది. ఈ మార్పు వెండి ధరలను స్వల్పంగా ప్రభావితం చేయవచ్చు, కానీ పారదర్శకత మాత్రం పెరుగుతుంది.

ప్రతి నెలా మొదటి తేదీ అంటే గ్యాస్ ధరల సమీక్ష రోజు. సెప్టెంబర్ 1న కూడా అదే జరుగుతుంది. గృహ ఉపయోగ LPG, వాణిజ్య ఉపయోగ LPGలలో ఈ రెండింటి ధరలను రివైజ్ చేస్తారు. పెరిగితే సామాన్యుల వంటగది బడ్జెట్ పెరుగుతుంది.
